FbTelugu

తెలంగాణలో 2వేలు దాటాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. సెకండ్ వేవ్ విజృంభణతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
రాష్ట్రం నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించగా ఇప్పటి వరకు కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది.

కరోనా బారి నుంచి 24 గంటల్లో 303 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో బుధవారం నాడు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పలు సూచనలు చేశారు. ఫంక్షన్లు, విందులు, వినోదాలు, ప్రయాణాలు మానుకోవాలని కోరారు. వీలైనంత మేరకు ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.