FbTelugu

మహారాష్ట్ర కేసులు 15,817

ముంబయి: ముంబయి స్టాక్ ఎక్చేంజీ మాదిరి మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన రెండు వారాలు కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కేసులు దేశంలోనే రికార్డు సృష్టిస్తున్నాయి.

మహారాష్రలో శుక్రవారం నాడు కొత్తగా 15,817 పాజిటివ్ కేసులు నమోదు కాగా ముంబయిలోనే 1,646 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదు అయిన రోజు కావడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో 5,42,693 మంది హోం క్వారంటైన్ లో ఉండగా 4,884 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ కేసులు పెరగడంతో నాగపూర్, అమరావతి తో పాటు అకోలా తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో లాక్ డౌన్ అమలవుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.