ముంబాయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 23 వేలు దాటేసింది. నిన్న ఒక్కరోజే 1,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,401 కి చేరింది.
మహారాష్ట్రలో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 868 మంది మరణించారు. కేవలం ముంబయి నగరంలోనే నిన్న ఒక్కరోజే 791 కరోనా కేసులు నమోదుకాగా.. 20 మంది మృతి చెందారు. ముంబయిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,355 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 528 కి చేరింది.