ముంబాయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే 2,347 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో నేటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 33,053 కు చేరింది. నిన్న ఒక్కరోజే 63 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,198 కి చేరింది.