FbTelugu

కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది…

మాస్కో:  కరోనా వ్యాక్సిన్ విడుదల చేసేందుకు ప్రపంచంలో ఎన్నో కంపెనీలు పోటీపడుతున్న తరుణంలో రష్యా దేశం శుభవార్తను చెప్పింది.

కరోనా వ్యాక్సిన్ కు విజయవంతంగా క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయయిని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీ డైరెక్టర్ వాడిమ్ తారసోవ్ ప్రకటించారు. రష్యాలోని గమాలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రో బయాలజీ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ తో గత నెల 18 నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వారు బుధవారం డిశ్చార్జీ అవుతుండగా, రెండో బృందం 20వ తేదీన డిశ్చార్జీ అవుతున్నారు. ఈ రెండు బృందాలకు యూనివర్సిటీ విజయవంతంగా పరీక్షలు పూర్తి చేయించింది. మానవ ఆరోగ్యానికి వ్యాక్సిన్ భద్రతను పరీక్షించగా విజయవంతం అయినట్లు యూనివర్సిటీ మరో డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషేవ్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.