FbTelugu

ఉచితంగా కరోనా వ్యాక్సిన్… బీజేపీ మేనిఫెస్టో

హైదరాబాద్‌: కరోనా టీకా తీసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని, జీహెచ్‌ఎంసీ ద్వారా ఉచితంగా ఇస్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు. అదే విధంగా భారంగా మారిన ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు.

ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ మేనిఫెస్టో ను విడుదల చేశారు. ప్రణాళిక బద్దంగా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. ఆక్రమణల వల్ల, జీహెచ్‌ఎంసీ వల్ల, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల హైదరాబాద్‌ మునిగిందన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి రూ.25 వేల పరిహారం ఇస్తామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మాణం చేస్తాం.

మహిళలకు, సిటీ బస్సుల్లో, మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా టాబ్స్, వైఫై సర్వీసు. మురికివాడలు, ఎస్సీ కాలనీల్లో వంద శాతం ప్రాపర్టీ టాక్స్ రద్దు చేస్తాం. 125 చదరపు గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. జీహెచ్ఎంసీలో 28వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు. పాత బస్తీలో విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు తీసుకుని, ప్రతి డివిజన్ కు రూ.4 కోట్ల నిధులిస్తాం. ఇప్పటి వరకు విధించిన ఛలాన్లు రద్దు చేస్తామని బీజేపీ నాయకులు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.