FbTelugu

కరోనా వ్యాక్సీన్ ప్రయోగం సక్సెస్

కరోనా వైరస్ కు వ్యాక్సీన్ కనిపెట్టడంలో ముందడుగు పడినట్టు తెలుస్తోంది. కోతులపై ప్రయోగించిన వ్యాక్సీన్ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినట్టు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. వచ్చే నెలాఖరు వరకు మనుషులపై జరిపిన ప్రయోగ ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

ప్రఖ్యాత భారత పూణే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ప్రయోల్లో పాలుపంచుకుంటోంది. సెప్టెంబర్ నాటికి 60 మినియన్ల డోసులు రిలీజ్ చేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు ప్రకటించారు. అయితే కరోనా వ్యాక్సీన్ ధర సుమారు రూ.1000 ఉండే అవకాశం ఉందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.