FbTelugu

ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా

అమరావతి: మహమ్మారి కరోనా ను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చారు. అలాగే ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జారీ చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా అనుమతిస్తున్నాయి. క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ. 3,250, వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తే రూ. 9,580, ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకు రూ. 5,980 గా నిర్థారించారు.

ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రూ. 6,280, ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ. 10,380 చొప్పున వసూలు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులన్నీఇవే ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.