FbTelugu

ప్రైవేట్ లో కరోనా చికిత్స ఫీజులు ఖరారు

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా చికిత్సల చార్జీలపై జీఒ నెంబర్ 40 విడుదల చేసింది.

సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4వేలు, ఐసియు గదిలో రోజుకు గరిష్టంగా రూ.7,500, వెంటిలేటర్ తో కూడిన ఐసియు గదికి రోజుకు గరిష్టంగా రూ.9వేలు ఖరారు చేసింది. పిపిఈ కిట్ ధర రూ.273 మించరాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. హెచ్.ఆర్.సి.టి కి రూ.1995, డిజిటల్ ఎక్స్ రే రూ.1300, ఐఎల్6 కు రూ.1300, డీ డైమర్ రూ.300, సి.ఆర్.పి రూ.500, ప్రొకాల్ సితోసిన్ రూ.1400, ఫెరిటిన్ రూ.400, ఎల్.డి.హెచ్ రూ 140 గా నిర్ణయించారు. సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సు కు కిలో మీటరుకు రూ.75, కనీసం రూ.2వేలు, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సు కు కిలో మీటరుకు రూ.125, కనీసం రూ.3వేలు గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు మించి ఏ ఆసుపత్రి అయినా వసూలు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.