FbTelugu

పతంజలి యోగ పీఠాన్ని తాకిన కరోనా

హరిద్వార్: కరోనిల్ వేసుకుంటే కరోనా హుష్ కాకీ అంటూ ప్రచారం చేసుకుని, ఆ తరువాత నాలుక్కరుచుకున్న పతంజలి యోగ పీఠంలో పలువురు కరోనా బారినపడ్డారు. గడచిన 13 రోజుల్లో ఉత్తరాఖండ్ లోని పతంజలిలో సుమారు 83 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పతంజలి యోగపీఠంలో 42 మంది, యోగ గ్రామంలో 28 మంది, ఆచార్య కులంలో 9 మందికి సోకింది. డాక్టర్ ఎస్.కె.ఝా మాట్లాడుతూ, గడచిన కొన్ని నెలలుగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు వెల్లడి అవుతున్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.