FbTelugu

అల్లు అర్జున్ పాజిటివ్

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తనకు వైరస్ సోకినట్లు ట్విటర్ ద్వారా అర్జున్ వెల్లడించారు. నేను ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నానని, తనతో కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫమాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల చేయగా 50 మిలియన్ల మంది వీక్షించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.