FbTelugu

వేలాది మహా పోలీసులకు కరోనా

ముంబై: ఏ రాష్ట్రంలో లేని విధంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ముంబై మహా నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

అయితే కరోనా వారియర్స్ అయిన పోలీసులు ఈ వైరస్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు 9,566 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇందులో 988 పోలీసు అధికారులు, 8,578మంది సిబ్బంది ఉన్నారు. సకాలంలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ 103 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 7,534 మంది కోలుకుని విధులకు హాజరు కాగా 1,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

లాక్ డౌన్ నిబంధనల విధుల్లో పాల్గొన్న పోలీసులపై దాడికి పాల్పడిన పౌరులపై 883 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అదే విధంగా లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన 2,19,975 మందిపై కేసులు నమోదు చేశారు.

You might also like