అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ కి కరోనా పాజిటివ్ సోకింది. ఈయనతో పాటు మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సచివాలయ ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు.
సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్ సోకింది. తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్లో పనిచేసే ఒక ఉద్యోగికి, ప్రణాళిక విభాగంలో డ్రైవర్, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి, సీఎం బ్లాక్‌లో ఆర్టీజీఎస్లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్, విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా వచ్చింది.