FbTelugu

టెన్నిస్ దిగ్గజం జాకోవిచ్ కు కరోనా

బెల్ గ్రేడ్: కరోనా వారు వీరు అనే తేడా లేకుండా అందరికీ సోకుతున్నది. తాజాగా టెన్నిస్ స్టార్ నొవాక్ జాకోవిచ్, ఆయన భార్య జెలీనాకు సోకింది.

అయితే వారి ఇద్దరు పిల్లలకు మాత్రం సోకలేదు. నేను బెల్ గ్రేడ్ చేరుకున్న తరువాత మా కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్ పరీక్షలు చేయించుకున్నామని జాకోవిచ్ తెలిపారు. తనకు, భార్య జెలీనాకు పాజిటివ్ రాగా, ఇద్దరు పిల్లలకు నెగెటివ్ వచ్చిందన్నారు. రెండు వారాల పాటు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

You might also like