FbTelugu

సన్నీడియోల్‌కు కరోనా

సిమ్లా : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వారు వీరూ అనే తారతమ్యం లేకుండా అందరికీ సోకుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్(64) కరోనా బారిన పడినట్టుగా వైద్యులు ధృవీకరించారు.

తాజాగా, సన్నీడియోల్, ఆయన స్నేహితులు ముంబై వెళ్లేందుకు సిద్ధమై కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో తన ఫాంహౌస్ లో ఉంటున్నారు. ఇటీవల తనని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకొని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.