FbTelugu

నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా

హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ అప్రమత్తమైంది.

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు బండ్ల గణేశ్ మీడియాకు తెలిపారు. జూబ్లిహిల్స్ అపోలో లేదా కాంటినెంటల్ లో చేరనున్నట్లు ఆయన  చెప్పారు. గత రెండు రోజులుగా బండ్ల గణేశ్ కు కరోనా సోకినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుండగా, నిజమేనని అంగీకరించారు.

ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ప్లాంటేషన్ నిమిత్తం వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్టు చేయించారు. టెస్టు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది.

You might also like