FbTelugu

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేకు కరోనా

హైదరాబాద్‌: వారు వీరు అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి అందరినీ కబలించి వేస్తోంది. తాజాగా.. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్థారించారు. 3 రోజుల క్రితమే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్యకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

తాజాగా నిన్న ఎమ్మెల్యే, అతని ఇద్దరు కుమారులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. ముగ్గురికీ కరోనా సోకినట్టుగా పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఎమ్మెల్యే కుటుంబం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

You might also like