FbTelugu

హైదరాబాద్ కలెక్టర్ కు కరోనా!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా.. అందరినీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా హైదరాబాద్ కలెక్టర్ స్వేతా మహంతికి కరోనా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం.

ఆమె డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ కు ఇప్పటికే కరోనా వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్వేతా మహంతి కార్యాలయంలో మొత్తం 15 మందికి కరోనా సోకింది. దీంతో గత కొన్ని రోజులుగా స్వేత మహంతి కార్యాలయానికి కూడా రావట్లేదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

You might also like