FbTelugu

కరోనా వైరస్ బారిన హీరోలు

హైదరాబాద్: కరోనా వైరస్ బారిన మరో హీరో పడ్డారు. హీరో కొణిదెల వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఇప్పటికే హీరో రామ్ చరణ్ కు వైరస్ సోకిన విషయం విదితమే.

ఇటీవల రామ్ చరణ్ నివాసంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకులకు చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇవాళ ఉదయం రామ్ చరణ్ తనకు వైరస్ సోకిందని ట్వీట్ చేశారు. తాజాగా వరుణ్ తేజ్ పాజిటివ్ నిర్థారణ అయ్యిందని వెల్లడించారు. వీరిద్దరి ప్రకటనతో మిగతా కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా పరీక్షలు చేయించుకుంటున్నట్లు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.