FbTelugu

డిప్యూటీ స్పీకర్ కు కరోనా

హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కుటుంబానికి కరోనా వైరస్ సోకగా, తాజాగా డిప్యూటీ స్పీకర్ టీ.పద్మరావుకు సోకింది.

పద్మారావు కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. గత మూడు రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఆయనతో పాటు కుటుంబంలోని నలుగురికి కూడా అంటుకున్నది. ప్రస్తుతం వీరందరూ సికింద్రాబాద్ లోని తమ నివాసంలో హోం క్వారంటైన్ లో ఉన్నారు.

దీంతో పలువురు రాజకీయ నాయకులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వరుసగా ఒకరి తరువాత ఒకరికి సోకుతుండడం కలవరానికి గురి చేస్తున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, బిగాల గణేష్ గుప్తా లకు పాజిటివ్ వచ్చిన విషయం విదితమే.

You might also like

Leave A Reply

Your email address will not be published.