FbTelugu

చీఫ్ జస్టిస్ కు కరోనా… హైకోర్టు మూడు రోజుల మూత

జైపూర్: కరోనా పాజిటివ్ కేసుల కారణంగా పోలీసు స్టేషన్ లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటి వరకు మూతవేశారు. తాజాగా జైపూర్ లో రాజస్థాన్ హైకోర్టు ను మూడు రోజుల పాటు మూసివేశారు.
రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతికి కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో మూడు రోజుల పాటు హైకోర్టు మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. మూడు రోజుల పాటు పనులు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి తో సన్నిహితంగా మెలిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు పరీక్షా సౌకర్యం అందుబాటులో ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.

You might also like