FbTelugu

మరో టీవీ ఆర్టిస్టుకు కరోనా

హరికృష్ణ గృహ లక్ష్మీ సీరియల్ లో హీరో గా చేస్తున్నాడు. గృహ లక్ష్మీ సీరియల్ కి ఈటీవీ ప్రభాకర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరోనా పాజిటివ్ సోకడంతో నేడు జరగాల్సిన గృహలక్ష్మీ షూటింగ్ రద్దు అయ్యింది.

మొన్న కరోనా వచ్చిన ఆర్టిస్టు ప్రభాకర్ తో కలిసి తిరిగడంతో అనుమానం వచ్చి హరికృష్ణ టెస్ట్ చేయించుకున్నాడు. ప్రభాకర్ తో కాంటాక్ట్ అయిన 33 మంది టెస్టు రిపోర్టులు రాకుండానే… మళ్ళీ షూటింగ్ లు మొదలు పెట్టారు.
ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్ రావడంతో టీవీ పరిశ్రమకు చెందిన ఆర్టిస్టులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

You might also like