FbTelugu

కర్నూలులో మరో వైద్యురాలికి కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి ఎక్కువౌతోంది. ముఖ్యంగా కర్నూలులో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా మరో వైద్యురాలికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వివరాల్లోకెళితే.. కర్నూలులోని జీజీహెచ్ లో ఓ వైద్యురాలికి కరోనా సోకింది.

అయితే ఇప్పటికే జీజీహెచ్ లో ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. మొత్తంగా జిల్లాలో 8 మంది వైద్యులకు కరోనా సోకింది. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేటికి 332 కు చేరింది. కాగా 9 మంది మరణించారు.

You might also like