FbTelugu

అంజలికి కరోనా… అదేంటి!

కరోనా సెకండ్ వేవ్ లో పలువురు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నారు. దేశంలో ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అటు బాలీవుడ్ మొదలు ఇటు టాలీవుడ్ వరకు వైరస్ వణికిస్తున్నది. టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, నివేదా థామస్ ఇలా ఎందరో దీని బారిన పడ్డారు.

వకీల్ సాబ్ హీరోయిన్ అంజలికి కూడా కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ వార్తలపై హీరోయిన్ అంజలీ స్పందించక తప్పలేదు. నాకు కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఎలాంటి వైరస్ సోకలేదని కొట్టి పారేసింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులను అంజలి కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.