FbTelugu

ఆంధ్రా సచివాలయ ఉద్యోగికి కరోనా

సెల్ఫ్ క్వారంటైన్ కు మిగతా ఉద్యోగులు

అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది.

గత రెండు రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారు, సికింద్రాబాద్ నుంచి బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగి మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి కోవిడ్ విభాగాని కు తరలించనున్నారు.

You might also like