FbTelugu

 అమితాబ్ బచ్చన్ కు కరోనా

ముంబయి: బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు, అతని కొడుకు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బిగ్ బీ నే స్వయంగా ట్విట్టర్ వెల్లడించారు. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉన్నారు.

గత పది రోజుల్లో తనని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ సూచించారు. అయితే వారికి కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రముఖులు బిగ్ బీ కోలుకోవాలంటూ.. ట్వీట్లు చేస్తున్నారు.

You might also like