FbTelugu

వంద మంది ట్రైనీ పోలీసులకు కరోనా!

చిత్తూరు: సుమారు 100 మంది ట్రైనీ పోలీసులు కరోనా బారీన పడిన ఘటన జిల్లాలోని చంద్రగిరి మండలం, కల్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చోటుచేసుకుంది. దీనిపై ప్రిన్సిపల్ సూర్యభాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షలు జరుతున్న కారణంగా వారికి సెలవులు ఇవ్వలేకపోయామని తెలిపారు. మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నట్టు తెలిపారు. ట్రైనీలు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.

You might also like