FbTelugu

యూఎస్ స్కూళ్లలో అలజడి

2 వారల్లోనే 97వేల మంది విద్యార్థులకు కరోనా

న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా అమెరికా దేశం ఇప్పటికే లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కోల్పోయింది. ఊహించని స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఇవేమి పట్టించుకోకుండా అమెరికా ప్రభుత్వం పాఠశాలను తెరిచింది. రెండు వారాల వ్యవధిలోనే 97 వేల మంది చిన్నారులకు కరోనా వేగంగా సోకింది. అయితే అలా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయో లేదో అప్పుడే చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో గడచిన రెండు వారాల్లో 97 వేల మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వెల్లడించింది.

జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు లక్ష మంది పిల్లలకు ఈ వ్యాధి సోకిందని… దీంతో పాఠశాలలను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అమెరికాలో ఇప్పటి దాకా సుమారు 50 లక్షల మంది కరోనా బారిన పడ్డారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. వీరిలో సుమారు 3.38 లక్షల మంది పిల్లలేనని గణాంకాలతో సహా తెలిపింది. సమీప భవిష్యత్తులో పిల్లలకు టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతున్నది. అప్పుడే వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చని వాండర్ బిల్ట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ టినా హార్టర్ట్ తెలిపారు.

స్కూళ్లను తెరవడానికి ముందే చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోయారు. దీంతో ఆన్ లైన్ క్లాసులను మాత్రమే నిర్వహించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నా ప్రభుత్వం విన్పించుకోవడం లేదు. కనీసం వ్యాక్సిన్ వచ్చేంత వరకూ స్కూళ్లు తెరువవద్దని కోరుతున్నారు.

You might also like