FbTelugu

110 మంది నిజామాబాద్ పోలీసులకు కరోనా

హైదరాబాద్: విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న పోలీసులను కరోనా వైరస్ భూతం వెంటాడుతోంది. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 110 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

జిల్లాలో గడచిన 24 గంటల్లో 862 మందికి కరోనా పాజిటివ్ సోకింది. అత్యధికంగా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతేడాది వచ్చిన ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ లో అత్యధిక కేసులు నమోదు అవుతుండడంతో పోలీసు సిబ్బంది వణికిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంటిపట్టున ఉండే అవకాశం లేకుండా పోయింది. మహమ్మారి విజృంభించడంతో పోలీసులు పగలు రాత్రి పని చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ మొదలుకావడంతో మరింత పనిభారం పెరిగిందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇంకెంత మందికి సోకుతుందోనన్న భయం వారిని వెంటాడుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.