FbTelugu

రిషీ కపూర్ ను మింగేసిన కరోనా?

ముంబై: తీవ్ర శ్వాసకోస సమస్యలతో బుధవారం రాత్రి బాలీవుడ్ నటుడు రిషికపూర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. ఇప్పటికే క్యాన్సర్ న్యూయార్క్ లో సుదీర్ఘకాలం వ్యాధికి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన లక్షణాలను గమనించి వైద్యులు కరోనా వైరస్ సోకినట్లుగా ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. ఆయన నుంచి సేకరించిన నమూనాలు ల్యాబ్ కు పంపించారు. నివేదిక వచ్చేలోపే  గురువారం ఉదయం 8.45 గంటలకు ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.

2018 అక్టోబర్ నెలలో క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో న్యూయార్క్ కు భార్యతో కలిసి వెళ్లారు. 11 నెలల 11 రోజుల తరువాత తిరిగి భార్య నీతు సింగ్ తో కలిసి ముంబై చేరుకున్నారు. మారో క్యాన్సర్ సమస్యతో పోరాడి, వైద్యుల చికిత్స తరువాత సురక్షితంగా వచ్చానని ముంబై చేరుకున్న తరువాత రిషికపూర్ మీడియాకు వెల్లడించారు.

You might also like