హైదరాబాద్: తెలంగాణాలో కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతించింది.
మొత్తం 9 ప్రభుత్వ, 18 ప్రైవేటు ల్యాబోరేటరీలకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం అనుమతించిన ల్యాబ్ లలో పరీక్షలకు ఫీజులు నిర్ణయించింది. ప్రైవేట్ లాబ్ లో కరోనా పరీక్షలు చేయించుకుంటే రూ. 2200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే టెస్ట్ ల వివరాలు ప్రభుత్వానికి అందించాలని నిబంధన విధించింది.
అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రి లో కరోనా చికిత్సకు వెళ్లిన వారు ఐసోలేషన్ కు రూ.4000లు, ఐసీయు (వెంటిలేటర్ అవసరం లేకుండా) రూ.7500లు, ఐసీయులో వెంటిలేటర్ సమకూర్చితే రూ.9000లు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతించిన ప్రైవేటు, ప్రభుత్వ ల్యాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రైవేటు ల్యాబ్ లు…
అపొలో హాస్పిటల్స్ లాబొరేటరీ, జూబ్లీ హిల్స్
విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్
విమ్టా ల్యాబ్స్, చర్లపల్లి
అపొలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్, లాబొరేటరీ, బోయినపల్లి
డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట
పాత్ కేర్ ల్యాబ్, మేడ్చల్
అమెరికన్ ఇని స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ, లింగంపల్లి
మెడ్సిస్ పాత్ ల్యాబ్స్, న్యూ బోయినపల్లి
యశోద హాస్పిటల్ ల్యాబ్, సికింద్రాబాద్
బయోగ్నోసిస్ టెక్నాలజీస్, మల్కాజిగిరి
టెనెట్ డయాగ్నోస్టిక్స్, బంజారాహిల్స్
మ్యాప్మి జెనోమ్ ఇండియా లిమిటెడ్, మాదాపూర్
విరించి హాస్పిటల్, బంజారాహిల్స్
కృష్ణ ఇని స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సికింద్రాబాద్
లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్, చర్లపల్లి
లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, సికింద్రాబాద్
స్టార్ హాస్పిటల్ ల్యాబ్, బంజారా హిల్స్
ప్రభుత్వ ల్యాబ్స్…
గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికేషన్ డిసీజెస్, నల్లకుంట
నిజాం ఇని స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజగుట్ట
ఇని స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నారాయణగూడ
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, ఎర్రగడ్డ
కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, తార్నాక
సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్, హైదరాబాద్
రాజీవ్ గాంధీ ఇని స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్.