FbTelugu

ఇంట్లోనే 15 నిమిషాల్లో కరోనా టెస్టు

న్యూఢిల్లీ: కరోనా టెస్టుల కోసం డయాగ్నిస్టిక్ సెంటర్ల వద్దకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా టెస్ట్ కిట్ ను భారత కంపెనీ తయారు చేసింది. కేవలం పావు గంటలో ఇంట్లోనే పరీక్షించుకునేందుకు కేవలం రూ.250 వెచ్చిస్తే సరిపోతున్నది.
టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా పూణేకు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సొల్యుషన్స్ లిమిటెడ్ టెస్టు కిట్ తయారు చేసింది.

ఈ కిట్ ను ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ (RAT) ధరను రూ.250గా నిర్ణయించింది. దీంతో 15 నిమిషాల్లో కరోనా సోకిందో లేదో స్వయంగా తెలుసుకోవచ్చు. కరోనా లక్షణాలు ఉన్న వారు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు టెస్టింగ్ కోసం వినియోగించవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. మరో వారం రోజుల్లో ఈ కిట్స్ బహిరంగ మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిని వినియోగించేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.