FbTelugu

కరోనా టెర్రర్‌.. ప్రముఖులకు పాజిటివ్

రాహుల్ గాంధీకి పాజిటివ్ నిర్థారణ

5 రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది

ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రాజకీయ ప్రముఖులను వెంటాడుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తో పాటు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

వీరే కాకుండా ఇటీవల జరిగిన కుంభమేళాలో పాల్గొన్న నేపాల్ మాజీ ప్రధాని జ్ఞానేంద్ర కు పాజిటివ్ వచ్చింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(ఈసి) సుశీల్​ చంద్ర తో పాటుగా ఎన్నికల కమిషనర్​‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆయన భార్య సునీత కు పాజిటివ్ నిర్థారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలనుంచి పాలకుల వరకు ఎవర్నీ వదలిపెట్టడం లేదు. తనకు పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, సన్నిహితంగా ఉన్నవారందరూ పరీక్షలు చేయించుకోవాలని రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. తమిళనాడు సిఎం పళని స్వామి, కేరళ సిఎం పినరయి విజయన్‌‌, కర్ణాటక సిఎం యడ్యూరప్ప, యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌లకు కరోనా బారిన పడ్డారు. తెలంగాణ సీఎం కెసిఆర్‌ కు కూడా సోమవారం సాయంత్రం పాజిటివ్ సోకినట్లు ప్రకటించారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కి కూడా కరోనా సోకడంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సిఈసి అధికార ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.