FbTelugu

209 దేశాలకు వ్యాపించిన కరోనా

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి ఎక్కవౌతుందే తప్ప తగ్గడం లేదు. ఈ వైరస్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలనూ కవర్ చేసేసిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 209 దేశాలకు వ్యాపించగా.. 14.33 లక్షల కేసులు నమోదైనాయి.

ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 82,100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు సమాచారం. అయితే కరోనా సోకిన వారిలో సుమారు మూడు లక్షల మంది కోలుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు సంఖ్య 4 లక్షలు దాటిపోవడంతో విలవిలలాడుతోంది. నిన్న ఒక్కరోజే 1900 మంది అక్కడ మృతి చెందారు.

You might also like