FbTelugu

భారత్ లో కరోనా విజృంభణ

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరగిపోతూ ఉంది. దేశంలో లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కరోనా పుంజుకుంది. క్రమంగా కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి.

నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 4,72,985 కు చేరింది. కాగా ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,907 కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 2,71,688 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,86,390 కి చేరింది.

You might also like