FbTelugu

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా సేవలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను  కూడా పూర్తి స్థాయిలో కరోనా సేవలకు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కోఠి లోని కమాండ్ కంట్రోల్ రూంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లను సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలతో, 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోం అధిపతులతో మంత్రి భేటీ అవ్వనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.