FbTelugu

ఇంగ్లండ్ క్రికెట్ కు తప్పని కరోనా సెగ

లండన్: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్నది. దీని దెబ్బకు పలు కంపెనీలు కుదెలవుతున్నాయి. ఎన్నో సంస్థలు మూతపడగా, మరికొన్ని ఉద్యోగాలను పీకేశాయి.

దీని దెబ్బకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా పొదుపు చర్యలు చేపట్టింది. పది మంది కాదు ఇరవై మంది కాదు ఏకంగా 62 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. నేడో రేపో వారిని ఇంటికి సాగనంపనున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఖర్చులను తగ్గించుకోవాలనే మా ముందున్న మార్గం ఇదొక్కటేనని సంస్థ సీఈఓ టామ్ హారిసన్ వెల్లడించారు.

దేశంలో క్రికెట్ భవితవ్యాన్ని కాపాడడానికి, ఈసీబీని మరింత చురుగ్గా పనిచేయించేందుకు ఈ చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఉద్యోగుల వేతన ఖర్చుల్లో 20 శాతం తగ్గించుకోవాలనే ప్రతిపాదన ఉందని, ఇది 62 మంది ఉద్యోగుల తొలగింపుతో సమానమని టామ్ అన్నారు.

You might also like