FbTelugu

తగ్గని వైరస్ కేసులు, పెరిగిన మరణాలు

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వరుసగా ఆరో రోజు కూడా కేసులు తగ్గకపోగా, మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.

గత 24 గంట్లో 2,57,299 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా 4,194 మంది చనిపోయారు. అదే విధంగా డిశ్చార్జీ అయిన వారు 3,57,630 కాగా ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసులు 2,62,70,365. శుక్రవారం నాడు 20,66,285 పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసలు 29,23,400 కాగా, ఇప్పటి వరకు మృతిచెందిన వారు 2,95,525 మంది. గడచిన 24 గంటల్లో 14,58,895 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.