FbTelugu

రెండో డోసు వేయించుకున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏయిమ్స్ లో ఇవాళ ఉదయం కోవాగ్జిన్ రెండో డోసు వేయించుకున్నారు. గత నెల ఒకటో తేదీన ఆయన ఏయిమ్స్ లో మొదటి డోసు వేసుకున్న విషయం తెలిసిందే.

ప్రధాని మోదీకి కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చిన నర్సులు అమితానందం చెందుతున్నారు. ఆయనకు వ్యాక్సిన్ ఇవ్వడంతో తమ జీవితంలో మధురమైన, మర్చిపోలేని సంఘటన అని చెబుతున్నారు. సిస్టర్ నిషా శర్మ, సిస్టర్ పి.నివేద గురువారం ఉదయం రెండో డోసు ఇచ్చారు. తన జీవితంలో మరిచ్చిపోలేని సంఘటన అని నిషా శర్మ వెల్లడించింది. తన స్వగ్రామం పంజాబ్ లోని సంగ్రూర్ అని తెలిపింది. రెండో డోస్ ఇవ్వడంలో సాయపడిన నివేద మాట్లాడుతూ, మోదీకి మొదటి డోస్ ఇచ్చిన వ్యాక్సినేటర్ తానేనని అన్నారు. ఈరోజు మళ్లీ రెండో డోస్ ఇచ్చేందుకు సహాయకారిగా ఉన్నానన్నారు. ఈ అవకాశం దక్కడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ప్రధానితో మాట్లాడామని, సెల్ఫీలు తీసుకున్నామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.