అమరావతి: దేశంలో కరోనా నుంచి కోలుకున్న రోగుల జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతమే ఎక్కవ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేధికగా.. ‘‘కరోనా నుంచి కోలుకున్న రోగుల జాతీయ సగటు 40 శాతం కంటే లోపే ఉంది.
ప్రపంచ యావరేజి కూడా ఇంచుమించు ఇంతే. సిఎం జగన్ గారు తీసుకున్న ప్రత్యేక చర్యలు, వైద్య సిబ్బంది అత్యుత్తమ చికిత్స అందించడం వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా రికార్డయింది. ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయం.’’ అంటూ ట్వీట్ చేశారు.