FbTelugu

విశాఖ ఏజెన్సీలో కరోనా పోస్టర్లు

విశాఖపట్నం: ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ సమయంలో పోస్టర్లువ వెలియడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు.
కొయ్యూరు మండలంలో మంప పరిధిలో పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసి అభివృద్ధి సమితి పేరట వెలిశాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో మంప పరిధిలో పలకజీడి, యు చీడిపాలెం, బుధరాల, బాలరేవుల, మంప, రేవల్లలో వాల్ పోస్టర్లు అతికించారు.

ఈ పోస్టర్ల లో మావోయిస్టు నాయకుడి భార్యకు కరోనా వచ్చింది అని పేర్కొన్నారు. ఛత్తీస్ ఘ్, ఒడిశా, ప్రాంతాల్లో తిరిగే మావోయిస్టులరా రెండు చేతులెత్తి దండాలు పెడుతున్నా మా గ్రామాలకు రావద్దు అని కోరారు. ఎలాంటి మీటింగులు పెట్టొద్దన్నారు. భౌతిక దూరం, శుభ్రత అంటే ఏమిటో కూడా అర్థం తెలియదని పోస్టర్ లో పేర్కొన్నారు. అలాంటి మీరు మా గిరిజనులకు ఆవాహన కల్పిస్తారా, మీ ద్వారా మాకు కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇకనుంచి మీరు మా గ్రామానికి రావద్దు అంటూ ఈ పోస్టర్ లో ముద్రించారు.

You might also like