FbTelugu

కుగ్రామం… ఒక్క కరోనా కేసు లేదు!

గుంటూరు: అదో కుగ్రామం. యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో దినదినగండంగా బ్రతుకుతుండగా ఆ గ్రామంలోని వారు నిశ్చింతంగా జీవిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో కరోనా పాజిటివ్ నమోదు కాలేదు.

వినుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉప్పరపాలెం గ్రామం ఉంది. ఆ గ్రామంలో నాలుగువేల జనాభా ఉంది. కరోనా వైరస్ దేశంలో ప్రారంభం మొదలు ఇప్పటి వరకు నియంత్రణకు అనేక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు, యువత, అధికారులు కలిసి కట్టుగా పనిచేయడం మూలంగా విజయవంతం అయ్యారు. పారిశుధ్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బయటి నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా నిబంధనలు పూర్తిగా అమలు చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా పాటించడంలో ఒక్కరు కూడా వైరస్ బారిన పడలేదు. ఉప్పరపాలెంలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారని, వినుకొండకు దగ్గరగా ఉన్నప్పటికీ సురక్షితంగా ఉందని మండల ఎంపిడిఒ వేముల వెంకట శివయ్య తెలిపారు. గ్రామస్తులు, యువత, సర్పంచి గోపు కృష్ణ వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.