FbTelugu

వరవరరావుకు కరోనా పాజిటివ్

ముంబై: కోరేగావ్ కేసులో కొన్ని నెలల నుంచి ముంబై జైలులో శిక్షను అనుభవిస్తున్న విరసం నేత వరవరరావుకు కరోనా సోకింది.

కరోనా పాజిటివ్ రావవడంతో ఆయనను సెయింట్ జార్జీ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. మే నెలలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జేజే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆ తరువాత ఆయన్ను మళ్లీ జైలుకు తరలించారు. కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో సెయింట్ జార్జీ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి.

You might also like