FbTelugu

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ కి పయనం అయ్యారు.

బాజిరెడ్డి గోవర్థన్ ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్ లో చేరతారా లేదా గాంధీ ఆసుపత్రిలో చేరతారా అనేది తెలియాల్సి ఉంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కుటుంబం యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో సాధారణ ప్రజలకే వచ్చిన కరోనా కాస్త ప్రజా ప్రతినిధులకు సోకుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.