FbTelugu

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా

విజయనగరం: శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావుకు రెండుసార్లు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకింది. తొలుత ట్రూ నాట్ టెస్ట్ లో పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. రెండోసారి ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ కు రక్త నమూనాలు పంపించగా అదే విధమైన రిపోర్టు వచ్చింది. ఎమ్మెల్యే తో పాటు గన్ మెన్ కు కరోనా పాజిటివ్ సోకిందని తేలింది. దీంతో ఎమ్మెల్యే కడుబండి హోమ్ క్వారంటైన్ కు పరిమితం అయ్యారు.
ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యే లను కడుబండి కలిశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు.

You might also like