FbTelugu

కేంద్ర హోం మంత్రి కి కరోనా పాజిటివ్

ఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్ సోకింది. తను చేయించుకున్న టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రాథమిక లక్షణాలు కన్పించంతో పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.

వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని అమిత్ షా కోరారు. టెస్టు రిపోర్టులు వచ్చే వరకు ఐసోలేషన్ లో ఉండాలని ఆయన కోరారు.

You might also like