FbTelugu

ఎమ్మెల్సీకి కరోనా… అసెంబ్లీ సమావేశాలు కుదింపు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరగడంతో అసెంబ్లీ, మండలి సమావేశాలు కుదించాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉంది.

ఎప్పటిలాగే శనివారం నాడు మండలి సమావేశాలకు హాజరైన పురాణం సతీష్ కొన్ని అంశాలపై మాట్లాడారు. వ్యాధి లక్షణాలు కన్పించడంతో రాపిడ్ టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని సతీష్ వెల్లడించారు. గత ఐదు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. సతీష్ గత నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశారు. ఎమ్మెల్సీ కి కరోనా రావడంతో మండలి, అసెంబ్లీ హాలును శానిటైజేషన్ చేయించారు. వీటితో పాటు శాసనసభా పక్షం కార్యాలయం, ఇతర గదులను కూడా శానిటైజ్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.