నెల్లూరు: ఏపీఎస్ ఆర్టీసీలో కరోనా కలకలం మొదలైంది. తాజాగా డిపో మేనేజర్ తో పాటు మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్ సోకింది. ఇప్పటికే ఇద్దరి ఉద్యోగులకు కరోనా వచ్చింది.
తమకు రక్షణ కిట్స్ లేకుండా డ్యూటీలకు వెళ్లబోమంటూ డ్రైవర్లు బస్సులు ఆపేశారు. రక్షణ కిట్లు సరఫరా చేయాలంటూ కండక్టర్లతో కలిసి డిపో ఎదుట డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు.
జీజీహెచ్ లో కరోనా సమస్య…
నెల్లూరు జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందికి కరోనా సోకడంతో మిగతి ఉద్యోగులుకు విధులకు వచ్చేందుకు జంకుతున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం ఇద్దరు డాక్టర్లు, నలుగురు హౌస్ సర్జన్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఓ టెక్నీషియన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించనున్నారు.