బెంగళూరు: పరప్పన ఆగ్రహార జైలులో దీర్ఘకాలంగా శిక్షను అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారి జె.జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
ఈ నెల 27న విడుదల అయి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉత్సాహంతో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. జ్వరం, వంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు తొలుత రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయినా నొప్పులు తగ్గకపోవడంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో ఆమెను చికిత్స కోసం శివాజి నగర్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి.