FbTelugu

జువైనల్ ఖైదీలకు కరోనా పాజిటివ్

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేటలోని జువైనల్ హోమ్‌లో ఎనిమిది మంది బాలురకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పాజిటివ్ సోకిన వారందరినీ చికిత్స నిమిత్తం ఏలూరు సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. తొలుత హోమ్ సూపరింటెండెంట్‌కు, తరువాత ఒక టీచర్‌కు కరోనా సోకింది. ఆ తరువాత వారి నుంచి బాలురకు సోకినట్లు సమాచారం.

కడపలో 19 మంది ఖైదీలకు కూడా…

కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటీవ్ వచ్చిన వారందరినీ ఫాతిమా కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. ఖైదీల నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించి పరిక్షించడంతో 19 మందికి పాజిటివ్‌ తేలింది. మిగతవారికి సోకకుండా ఉండేందుకు జైలు పరిసర ప్రాంతాలను ద్రావకంతో శుభ్రం చేయించారు.యించారు.

You might also like